శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2017 (10:38 IST)

టీటీడీ బంపర్ ఆఫర్: క్యూ కాంప్లెక్సుల్లో ఉచిత ఫోన్ సౌకర్యం.. 2 నిమిషాల తర్వాత?

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లో గంటల తరబడి వేచి ఉండే భక్తులు.. తమవారి యోగక్షేమాల గురించి టెన్షన్ పడుతుంటారు. వారితో మాట్లాడేందుకు వీరికి

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లో గంటల తరబడి వేచి ఉండే భక్తులు.. తమవారి యోగక్షేమాల గురించి టెన్షన్ పడుతుంటారు. వారితో మాట్లాడేందుకు వీరికి ఎలాంటి అవకాశం ఉండదు. మొబైల్ ఫోన్లను బయటే మొబైల్ లాకర్స్‌లో పెట్టి దర్శనానికి వెళుతుండటమే ఇందుకు కారణం. ఈ ఇబ్బంది ఇకపై ఉండదు.  
 
ఈ ఇబ్బందిని గమనించిన టీటీడీ కొత్త ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భక్తులకు ఉచిత ఫోన్ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగా  ఓ క్యూ కాంప్లెక్స్‌లో ఓ ఫోన్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. తొలుత కాయిన్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ.. చివరకు ఉచితంగా సేవలను అందించాలని నిర్ణయించారు. అయితే, ఈ ఫోన్ కాల్ రెండు నిమిషాల సేపు మాత్రమే ఉంటుంది... రెండు నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది. 
 
ఇదిలా ఉంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్ట్‌కు రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల అధినేత చొప్పా గంగిరెడ్డి మంగళవారం 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. మంగళవారం వేకువజామున శ్రీవారి దర్శనం చేసుకున్న గంగిరెడ్డి ఈ విరాళాన్ని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజుకు అందజేశారు.