1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Free tirumala temple tour for poor people

పేదలకు ఉచిత తిరుమల యాత్ర.. దేవాదాయ శాఖ పరిశీలన

tirumala temple tour
ముస్లిం సోదరులకు అందుబాటులో ఉన్న హజ్‌ యాత్ర తరహాలో రాష్ట్రంలోని నిరుపేద హిందువులను ఉచితంగా తిరుమల యాత్రకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హిందూ దేవదాయ, ధర్మాదాయ శాఖ కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. యేడాదికి జిల్లాకు వెయ్యి మంది చొప్పున గుర్తించి విడతల వారీగా తిరుమల యాత్రకు తీసుకెళ్లనున్నారు. 
 
రాష్ట్రం మొత్తంగా యేడాదికి 13 వేల మందికి ఉచితంగా తిరుమల యాత్రకు అవకాశం దక్కుతుంది. లబ్ధిదారుడి సొంతం ప్రాంతం నుంచి తిరుమలకు వెళ్లే మార్గమధ్యంలో మరో రెండు ప్రముఖ దేవాలయాల సందర్శనకు అవకాశం కల్పిస్తారు. ఈ పథకానికి దివ్యదర్శనంగా నామకరణం చేయాలని ఆలోచనలో ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. 
 
ప్రస్తుతం అధికారులు లబ్ధిదారుల ఎంపిక తీరు తదితర అంశాలపై విధివిధానాలు రూపకల్పన చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 
తర్వాతి కథనం
భక్తులు సంతృప్తి చెందితేనే సేవకు ప్రతిఫలం : తితిదే ఈఓ సాంబశివరావు