శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2016 (11:38 IST)

ఉచితంగా తిరుమల యాత్ర దర్శనం... ప్రమాద బీమా సౌకర్యం కూడా...

గ్రామీణ, పట్టణ పేదలను ఉచితంగా తిరుమల యాత్రకు తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హిందూ దేవదాయశాఖ కొత్తగా ప్రవేశపెట్టదలచిన దివ్యదర్శనం పథకం విధివిధానాలను ఆ శాఖ ముఖ్య కార్యదర్సి జె.ఎస్వీ. ప్రసాద్‌ వివర

గ్రామీణ, పట్టణ పేదలను ఉచితంగా తిరుమల యాత్రకు తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హిందూ దేవదాయశాఖ కొత్తగా ప్రవేశపెట్టదలచిన దివ్యదర్శనం పథకం విధివిధానాలను ఆ శాఖ ముఖ్య కార్యదర్సి జె.ఎస్వీ. ప్రసాద్‌ వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం గరిష్టంగా ఇంటికి ఐదుగురికి అవకాశం కల్పిస్తారు. మూడేళ్ల లోపు పిల్లలను అదనంగా తీసుకెళ్ళవచ్చు. హిందూమతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే ఈ పథకంలో 90 శాతం లబ్దిదారులుగా ఎంపిక చేస్తారు.
 
అగ్ర కులాల్లో తెల్లకార్డులున్న వారినీ, అది 70 యేళ్ళ లోపు వారే అర్హులు. ప్రతి జిల్లా నుంచి విడతల వారీగా యేడాదికి పదివేల మందికి ఉచిత తిరుమల దర్శనం కల్పిస్తారు. ఉచిత తిరుమల యాత్ర 4 నుంచి 5 రోజుల పాటు ఉండేలా తిరుమల యాత్రతో పాటు మార్గమధ్యంలో నాలుగు ప్రధాన ఆలయాల దర్శనానికి అవకాశం కల్పిస్తారు. 
 
ఈ పథకానికయ్యే ఖర్చును తితిదే నిధులతో పాటు రాష్ట్రంలో ఏడు ప్రధానంగా ఉన్న ఏడు దేవాలయాల ఆదాయం నుంచి ఖర్చు చేస్తారు. ఉచిత యాత్ర సమయంలో లబ్దిదారులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడానికి దేవదాయశాఖ కమిషనర్‌ చర్యలు చేపడతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.