1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2016 (14:20 IST)

మనిషికి తెలియని రహస్యాలు ఏంటో తెలుసా? లాలాజలంతో రెండు స్విమ్మింగ్స్ ఫూల్స్ నింపొచ్చట!

ఈ భూ ప్రపంచం మీద ఎన్నెన్నోవింతలు విడ్డూరాలు ఉన్నాయి. భగవంతుని సృష్టిలో మనుషులతో పాటు ఎన్నో రకాల ప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. వాటి గురించి మనకు అన్ని విషయాలు తెలుసని అనుకుంటే పప్పు కాలేసినట్టే. నిజాన

ఈ భూ ప్రపంచం మీద ఎన్నెన్నోవింతలు విడ్డూరాలు ఉన్నాయి. భగవంతుని సృష్టిలో మనుషులతో పాటు ఎన్నో రకాల ప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. వాటి గురించి మనకు అన్ని విషయాలు తెలుసని అనుకుంటే పప్పు కాలేసినట్టే. నిజానికి మనకు తెలియని రహస్యాలు కూడా ఎన్నో దాగున్నాయి. వాటిలో కొన్ని మీ కోసం.. 
 
వినోదం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వినోదంగా కాలం గడపడం అంటే కొంత మందికి భయం. ఆ ఫోబియాను ''చెరోఫోబియా'' అంటారు. మగ బిల్లీ గోట్స్‌ (మేక జాతుల్లో ఒక రకం)లో తమ తల మీదనే మూత్ర విసర్జన చేసుకుంటాయట. ఆడ బిల్లీ గోట్స్‌ను ఆకర్షించడానికే అవి అలా చేస్తాయట.
 
మనిషి నోట్లోని లాలాజలం మరిగే స్థాయి సాధారణ నీటి కంటే మూడు రెట్లు ఎక్కువట. అంటే 300 డిగ్రీల వరకు వేడి చేస్తే కానీ లాలాజలం మరగదు. సగటు మనిషి తన జీవిత కాలంలో ఉత్పత్తి చేసిన లాలాజలంతో రెండు స్విమ్మింగ్‌ ఫూల్స్‌ను నింపవచ్చంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. 
 
శృంగారానికి ముందు గుమ్మడికాయను వాసన చూస్తే, అంగస్తంభన వెంటనే జరుగుతుందట. ఒక మగ పురుషుడి నుంచి సేకరించిన వీర్యంతో ప్రపంచంలోని మహిళలందరినీ గర్భవతులను చేయొచ్చట.