తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ప్రతియేటా బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహిస్తోంది. సుగంధ, పరిమళ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ప్రతియేటా బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహిస్తోంది. సుగంధ, పరిమళ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్థి చేశారు టిటిడి సిబ్బంది.
తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో పాటు ఈఓ సాంబశివరావు, జెఈఓ శ్రీనివాసరాజులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని ఆలయంలో పలు ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. ఉదయం 11 గంటల వరకు దర్సనాన్ని నిలిపివేసిన టిటిడి అధికారులు ఆ తర్వాత సర్వదర్శనానికి అనుమతించారు.