1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (15:45 IST)

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో నమాజ్ చేసిన ముస్లిం.. అపచారం జరిగిందా? శ్రీవారికి కేసీఆర్ రూ.5.5కోట్ల ఆభరణాలు?

కలియుగ వైకుంఠం శ్రీవారి ఆలయంలో అపచారం జరిగింది. తిరుమలలో భద్రత కరువైందనే విషయం మరోసారి బయటపడింది. పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమతస్థులకు ప్రవేశం నిషిద్ధమనే విషయం తెలిసిందే. ఒకవేళ హిందూ మతంపై మ

కలియుగ వైకుంఠం శ్రీవారి ఆలయంలో అపచారం జరిగింది. తిరుమలలో భద్రత కరువైందనే విషయం మరోసారి బయటపడింది. పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమతస్థులకు ప్రవేశం నిషిద్ధమనే విషయం తెలిసిందే. ఒకవేళ హిందూ మతంపై మక్కువతో ఎవరైనా వెళ్లినా, వారు హిందూ మతాన్ని, సంప్రదాయాలను గౌరవించాల్సి ఉంటుంది. 
 
అలా గౌరవించకుండా గతంలో ఓ క్రైస్తవ పాస్టర్ ప్రవర్తించగా.. తాజాగా ఓ ముస్లిం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్దకు వెళ్లి...అక్కడ నమాజ్ చేశాడు. దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మక్కాకు వెళ్లి అభిషేకం చేస్తే ఇలాగే ఉంటుందా అంటూ హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కాగా నమాజ్ చేసిన వ్యక్తి బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. అయితే శ్రీవారి ఆలయంలో ఇలా నమాజ్‌లు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు.
 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 30వ తేదీన శ్రీవారిని దర్శించకుని మొక్కులు తీర్చుకోనున్నారు. ఈ సందర్భంగా రూ.5.5కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వామి వారికి సమర్పించుకుంటారు. తెలంగాణ సీఎం పదవి లభించినందుకుగాను శ్రీవారికి కేసీఆర్ ఈ మొక్కు తీర్చుకుంటున్నారు.

తిరుపతి పర్యటన సందర్భంగా జనవరి 29న మరమ్మత్తులకు అనంతరం శ్రీకాళహస్తీశ్వర రాజగోపురాన్ని ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీవారికి మొక్కు చెల్లించేందుకు కూడా ప్రభుత్వ ఖజానాలో కేసీఆర్ చేయిపెట్టలేదని.. తన సొంత డబ్బుతో మొక్కు తీర్చుకుంటున్నారని కేసీఆర్ సన్నిహితులు వెల్లడించారు.