1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. National Geographic Channel Documentary On Tirumala

తిరుమల గిరులపై నేషనల్ జియో గ్రాఫిక్ ఛానల్ 43 ని. డాక్యుమెంటరీ-27న ప్రసారం

తిరుమల గిరులపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటలూ భక్తులతో కిటకిటలాడుతూ నిత్య కల్యాణం, పచ్చతోరణంలా కనిపించే శ్రీవారి ఆలయంపై నేషనల్ జియో గ్రాఫిక్ ఛా

National Geographic Channel
తిరుమల గిరులపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటలూ భక్తులతో కిటకిటలాడుతూ నిత్య కల్యాణం, పచ్చతోరణంలా కనిపించే శ్రీవారి ఆలయంపై నేషనల్ జియో గ్రాఫిక్ ఛానల్ సైతం అబ్బురబడింది. ప్రముఖ ఆలయాల్లో జరుగుతున్న అన్నదానాలపై 'మెగా కిచెన్' పేరిట డాక్యుమెంటరీ ప్లాన్ చేసుకుంది. ఇందులో భాగంగా రెండు నిమిషాల క్లిప్పింగ్స్ కోసం తిరుమలకు కూడా ఎన్జీసీ టీమ్ వచ్చింది. 
 
కానీ వెంకన్న వైభవాన్ని స్వయంగా తిలకించిన ఎన్జీపీ టీమ్.. 'తిరుమల తిరుపతి ఇన్ సైడ్ స్టోరీ' పేరిట ఏకంగా రెండు ఎపిసోడ్‌లతో 43 నిమిషాల డాక్యుమెంటరీని తీసింది. ఆరు నెలల పాటు శ్రమించిన ఎన్జీసీ టీమ్.. బ్రహ్మోత్సవాల నుంచి నిత్య సేవల వరకూ వీడియో తీసింది. మొత్తం ఆరుగురు సభ్యులున్న ఈ బృందం తీసిన డాక్యుమెంటరీ ఈనెల 27 రాత్రి ప్రసారం కానుంది.
About Writer
Selvi
తర్వాతి కథనం
దశావతారాలకు కారణం ఏమిటి? విష్ణుమూర్తికి ఆ అవతారాలెందుకు?