మే నెలలో మాత్రం కోటి లడ్డూల పంపిణీ.. శ్రీవారి లడ్డూ రికార్డు.. టీటీడీ ప్రకటన
కలియుగ వైకుంఠం, తిరుమల శ్రీవారి ప్రసాదం అంటేనే మనకు ముందు గుర్తుకొచ్చేది లడ్డూ ప్రసాదమే. టీటీడీ దేవస్థానం తయారు చేస్తున్న లడ్డూలను లక్షలాది మంది భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక్క మే నెలలోనే కోటి లడ్డూలను పంపిణీ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డు సృష్టించింది.
వేసవి సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరగడంతో మేలో మాత్రం కోటి లడ్డూలను శ్రీవారి ఆలయ పోటు విభాగం పంపిణీ చేసినట్లు ఆదివారం తేలింది. ఎన్నడూ లేనంతగా మే నెలలో 25.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు.
స్వామిని దర్శించుకునే ధర్మదర్శనం భక్తులకు రాయితీపై రూ.20 ధరతో 2, అదనపు లడ్డూలు కింద రూ.50పై రెండు 2 వంతున ఒక్కొక్కరికి నాలుగు లడ్డూలు టీటీడీ అందిస్తుంది. ఇంకా కాలినడక వచ్చే యాత్రికులు, వికలాంగులు, వృద్ధులు, వీఐపీ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లపై ఇచ్చే లడ్డూలను లెక్కిస్తే.. మే నెలలో మాత్రం కోటివరకు లడ్డూలను భక్తులకు పంపిణీ చేసినట్లు.. తద్వారా రికార్డు సృష్టించినట్లు టీటీడీ వెల్లడించింది.