బుధవారం, 26 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 13 జూన్ 2016 (10:36 IST)

శరవేగంగా బూంది పోటు మరమ్మత్తు పనులు

తిరుమలలో రెండు రోజుల పాటు జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన బూందిపోటు పనులను తితిదే అధికారులు వేగవంతంగా చేస్తున్నారు. ఆలయంకు అతిసమీపంలో ఉన్న ఈ బూంది పోటులో కొత్త సామగ్రిని అమరుస్తున్నారు తితిదే సిబ్బంది. 
 
భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిపుణుల సూచనలను తితిదే పాటిస్తోంది. ప్రస్తుతం నాలుగు వరుసల్లో రెండింటిని 20 పొయ్యిలపై బూంది తయారీ ముమ్మరంగా జరుగుతోంది. 
 
లడ్డూ ప్రసాదం కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నాలుగు వరుసల్లోని 40 గ్యాస్‌ పొయ్యిలు పనిచేసే విధంగా పనులు చేస్తున్నారు. తితిదే ఈఓ సాంబశివరావు పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు.