శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 21 నవంబరు 2016 (10:27 IST)

శ్రీకాళహస్తి ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత

రెండు తెలుగురాష్ట్రాల్లోను ప్రసిద్దిచెందిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయాన్ని మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బాబు గురుకుల్‌ మృతి చెందడంతో ఆలయాన్ని మూసివేశారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సాధారణంగా ఎప్పట

రెండు తెలుగురాష్ట్రాల్లోను ప్రసిద్దిచెందిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయాన్ని మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బాబు గురుకుల్‌ మృతి చెందడంతో ఆలయాన్ని మూసివేశారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సాధారణంగా ఎప్పటికీ మూయరు. చంద్రగ్రహణమైనా, సూర్యగ్రహణమైనా, ఏ గ్రహణమైనా శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచుతారు. కానీ ఆలయ ప్రధాన అర్చకులు మరణించడంతో తెల్లవారుజాము 4 గంటలకు మూసేశారు.
 
ప్రధాన అర్చకులు అంత్యక్రియల తర్వాత సోమవారం ఉదయం 5గంటలకు తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు. ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ప్రధాన అర్చకుని పార్థీవ దేహాన్ని శ్రీకాళహస్తిలోని తేరువీధిలో ఉంచారు. పలువురు ప్రముఖులు పార్ధీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.