శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (15:36 IST)

బాత్రూమ్‌లో పడిన తిరుమల ప్రధాన అర్చకులు... వెన్నెముకకు గాయం

తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కాలు జారి కిందపడ్డారు. అది కూడా బాత్రూమ్‌లో. సోమవారం సాయంత్రం స్నానం చేయడానికి వెళ్ళిన రమణ దీక్షితులు ఒక్కసారిగా బాత్ రూంలోకి పాచి ఉండటంతో జారి కిందపడిపోయారు.

తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కాలు జారి కిందపడ్డారు. అది కూడా బాత్రూమ్‌లో. సోమవారం సాయంత్రం స్నానం చేయడానికి వెళ్ళిన రమణ దీక్షితులు ఒక్కసారిగా బాత్ రూంలోకి పాచి ఉండటంతో జారి కిందపడిపోయారు. దీంతో ఆయన వెన్నెముకకు గాయమైంది. తిరుమలలో రమణ దీక్షితులు నివాసముంటున్నారు. ఆయనకు గాయమైందే వెంటనే తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. అయితే రమణ దీక్షితులను చెన్నైకు తీసుకెళ్ళమని వైద్యులు సలహా ఇవ్వడంతో చెన్నైకు తీసుకెళ్ళారు.
 
ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రమణదీక్షితులకు చికిత్స పొందుతున్నారు. ఆరువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆసుపత్రి వైద్యులు రమణ దీక్షితులకు సూచించారు. దీంతో ఒకటిన్నర నెల పాటు రమణదీక్షితులు తిరుమలలో జరిగే సేవా కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండనున్నారు.