తిరుమల కంపార్టుమెంట్లన్నీ ఖాళీ... శ్రీవారి దర్శనం గంటలోనే...
తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం గంటలోనే భక్తులకు లభిస్తోంది. తిరుమలలోని కంపార్టుమెంట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. గురవారం ఉదయం 5గంటల నుంచి సర్వదర్సనం కోసం 3కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు, అలాగే కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్సనంతో పాటు కాలినడక భక్తులకు గంటలోనే దర్శనభాగ్యం లభిస్తోంది. నిన్న శ్రీవారిని 56,069మంది భక్తులు దర్సించుకున్నారు. హుండీ ఆదాయం 2కోట్ల 32లక్షల రూపాయలు వచ్చింది.
