1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Tirumala tirupathi online tickets

ఆన్‌లైన్‌లో 26వేల శ్రీవారి సేవా టిక్కెట్లు: దళారులకు చెక్ పెట్టేందుకేనా?

Tirumala tirupathi online tickets
భక్తులకు సౌకర్యంగా ఉంటుందని, దళారులను నివారించవచ్చుననే ఉద్దేశంతో తిరుమల వెంకన్న సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి  దేవస్థానం విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, కల్యాణం, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకరణలతో పాటు విశేషపూజ, నిజపాద దర్శనం తదితర అన్ని సేవలకూ సంబంధించిన టిక్కెట్లను ఆన్ లైన్లో ఉంచినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
 
జనవరి 1 నుంచి 31 వరకూ మొత్తం 26,063 టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈ టిక్కెట్లు అమ్మకాన్ని ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.
About Writer
Selvi