శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2016 (13:00 IST)

సప్తగిరులపై బ్రహ్మోత్సవం శోభ - బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విష్వక్సేనుడి వైభవంగా మాఢా వీధుల్లో ఊరేగించారు. వందలాదిమంది భక్తుల గోవిందనామస్మరణల మధ్య వైభవోపేతంగగా విష్వక

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విష్వక్సేనుడి వైభవంగా మాఢా వీధుల్లో ఊరేగించారు. వందలాదిమంది భక్తుల గోవిందనామస్మరణల మధ్య వైభవోపేతంగగా విష్వక్సేనుడి విహరించారు. సప్తగిరులు మొత్తం బ్రహ్మోత్సవం శోభను సంతరించుకుంది. భక్తుల మనసుల్లో ఆధ్మాత్మిక భావనలు వెల్లివిరుస్తున్నాయి. మంగళవారం రాష్ట్రప్రభుత్వం తరపున శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. 
 
కాగా, ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. దక్షిణ మాడ వీధిలో ప్రత్యేక గేటు ద్వారా వీరిని దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన భక్తుల మాదిరిగా వీరు చుట్టూ తిరిగి రావాల్సిన పని లేకుండా గంటలోనే స్వామి దర్శనం చేసుకునేందుకు వీలుంది. ఉదయం 10 గంటలకు ఓసారి, మధ్యాహ్నం 3 గంటలకు ఓ సారి భక్తులను ఇక్కడ అనుమతిస్తారు. దానికి రెండు గంటల ముందుగానే వైకల్య సర్టిఫికెట్, వృద్ధాప్యాన్ని నిర్ధారించే పుట్టిన తేదీ ధ్రువీకరణలతో భక్తులు చేరుకోవాల్సి ఉంటుంది.