Daily Horoscope
✕

తిరుమలలో ఈనెల 11, 12న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

Written By ttdj
Updated: మంగళవారం, 7 జూన్ 2016 (14:53 IST)
సర్కారీ సహస్ర కలశాభిషేకం సందర్భంగా తిరుమలలో ఈనెల 11, 12వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే జెఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. వేసవి సెలవుల వరకు ప్రతి శుక్రవారం విఐపి దర్శనాలను రద్దు చేస్తూ వస్తోంది. అయితే సహస్ర కలశాభిషేకం కావడంతో వరుసగా రెండు రోజులు విఐపి బ్రేక్‌ దర్శనాలు రద్దు కానున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు విఐపి దర్శనాలు రద్దు కానున్నాయి.
 
అలాగే వేసవి సెలవుల రద్దీ సందర్భంగా భక్తులకు లడ్డూల కొరత రానీయకుండా పనిచేసిన పోటు కార్మికులకు 480 మందికి 2,500 రూపాయల చొప్పున బహుమానం అందిస్తున్నట్లు తితిదే జెఈఓ శ్రీనివాసరాజు తిరుమలలో మీడియాకు తెలిపారు. 
 
ఇదిలావుండగా, తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో జూన్‌ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
 
తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను 1.30 గంటల నుంచి దర్శనానికి అనుమతించారు.

అన్నీ చూడండి

బుధవారం, నవంబర్ 25, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంటుంది?

తిరుప్పరంకుండ్రం కొండపై వెలగని కార్తీక దీపం.. విజయ్ సర్కారుకు తప్పని తిప్పలు

15మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.. డబ్బు, నగలే కాదు.. అవన్నీ దోచుకున్నాడు..

సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలై

పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?

అన్నీ చూడండి

25-11-2026 బుధవారం దిన ఫలాలు - కుటుంబంలో సంతోషకరమైన పరిణామం..?

24-11-2026 మంగళవారం దిన ఫలాలు - అనవసర ఖర్చులను నియంత్రించాలి

కార్తీక పౌర్ణమి, కార్తీక దీపం ఎందుకు వెలిగించాలి?

కార్తీక సోమవారం రోజు శివుడిని, చంద్రుడిని పూజిస్తే..?

23-11-2026 సోమవారం దిన ఫలాలు - పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు...

తర్వాతి కథనం
Show comments