1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. TTD to christen Tirumala streets after religious personalities, philosophers

తిరుమలలోని వీధులకు వేదాల పేర్లు.. పుష్కరిణికి శ్రీ కృష్ణదేవరాయల మార్గం

Tirumala
తిరుమల తిరుపతి దేవస్థానాలు పాలకమండలి తిరుమలలోని వీధులు, సర్కిళ్లు, ప్రధాన మార్గాలకు ఆధ్యాత్మిక, పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన కొత్త పేర్లను ఖరారు చేసింది. శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధులకు నాలుగు వేదాల పేర్లను ఖరారు చేశారు. తూర్పు మాడ వీధిని రుగ్వేద మార్గం, దక్షిణ మాడ వీధిని యజుర్వేద మార్గం, పశ్చిమ మాడ వీధిని సామవేద మార్గం, ఉత్తర మాడ వీధిని అధర్వణవేద మార్గంగా పిలవనున్నారు. 
 
అలాగే ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశానికి భగవద్రామానుజాచార్య ప్రాంగణం అని, బేడి ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతానికి సాళువ నరసింహరాయల ప్రాంగణం అని పేర్లు పెట్టారు.
 
తిరుమలలోని ప్రధాన కూడళ్ల పేర్లను కూడా మార్చారు. లేపాక్షి సర్కిల్‌ను అన్నమయ్య కూడలి, రామ్‌బగీచ సర్కిల్‌ను తొండమాన్ చక్రవర్తి కూడలి, ఎస్‌ఎంసీ సర్కిల్‌ను పురందరదాసు కూడలిగా నామకరణం చేశారు. 
 
ఔటర్ రింగ్ రోడ్డుకు తిరువేంకటపథం, ఇన్నర్ రింగ్ రోడ్డుకు అన్నమాచార్య మార్గం పేర్లు ఖరారయ్యాయి. రామ్‌బగీచ నుంచి పుష్కరిణి వరకు ఉన్న మార్గానికి శ్రీ కృష్ణదేవరాయల మార్గం అని పేరు పెట్టారు.  
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
07-05-2026 గురువారం ఫలితాలు - ఇతరులకు ధనసహాయం తగదు