Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తిరుమలకు వెళుతున్నారా... మీ పిల్లలు జాగ్రత్త.. (వీడియో) చూడండి ఎలా ఎత్తుకెళ్తున్నాడో...

తిరుమలకు వెళితే పుణ్యం వస్తుందని, శ్రీవారిని దర్శించుకుంటే తెలియని ఆనందం వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ తిరుమలకు వెళితే మాత్రం మీ పిల్లలను ఎత్తుకెళ్ళే ముఠా ఒక తిరుగుతోందన్న విషయాన్ని మాత్రం గుర్తించుకోండి. తిరుమలలో పిల్లను కిడ్నాప్ చేసే ముఠాను గుర్

Written By TJ
Updated: బుధవారం, 14 జూన్ 2017 (15:46 IST)
తిరుమలకు వెళితే పుణ్యం వస్తుందని, శ్రీవారిని దర్శించుకుంటే తెలియని ఆనందం వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ తిరుమలకు వెళితే మాత్రం మీ పిల్లలను ఎత్తుకెళ్ళే ముఠా ఒక తిరుగుతోందన్న విషయాన్ని మాత్రం గుర్తించుకోండి. తిరుమలలో పిల్లను కిడ్నాప్ చేసే ముఠాను గుర్తించారు పోలీసులు. గత కొన్ని నెలలుగా ఈ ముఠా తిరుమలలో తిరుగుతూ పిల్లలను ఎత్తుకెళ్ళిపోతున్నారని పోలీసులు వాట్సాప్ ద్వారా ఫోటోలను విడుదల చేశారు. 
 
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం ఉరవకొండ గ్రామానికి చెందిన వెంకటేష్‌ కుటుంబ సభ్యులు నిన్న తిరుమల శ్రీవారికి దర్శనార్థం వచ్చారు. గదులు దొరక్కపోవడంతో గుడి ముందే పడుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 5.56 నిమిషాలకు భార్యాభర్తలు గాఢనిద్రలో ఉండగా వారి సంవత్సరం బిడ్డ చెన్నకేశవులను ఒక కిడ్నాపర్ కిడ్నాప్ చేశాడు. 
 
నిందితుడు పిల్లాడిని కిడ్నాప్ చేసిన విజువల్స్ సిసి కెమెరాల్లో నమోదయ్యాయి. కిడ్నాపర్ ఫోటోను తిరుమల పోలీసులు విడుదల చేశారు. ఈ ముఠా గతంలో కూడా చాలామంది పిల్లలను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియో చూడండి.

అన్నీ చూడండి

October 04, 2026: మంగళవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

బతుకమ్మ, దసరా వేడుకలు ముస్తాబవుతున్న భాగ్యనగరం

కునో నేషనల్ పార్క్‌లో ఐదు పిల్లలకు జన్మనిచ్చిన కేజేపీ21 అనే ఆడ చిరుత (video)

APSRTC: దసరా పండుగ రద్దీ.. హైదరాబాద్, వైజాగ్ నగరాలకు ప్రత్యేక బస్సులు

చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి దొరికాడోచ్... స్థానికులే పోలీసులకు...?

అన్నీ చూడండి

05-10-2026 సోమవారం ఫలితాలు - ఆశించిన పదవి దక్కకపోవచ్చు...

04-10-2026 - ఆదివారం రోజువారీ రాశి ఫలాలు - ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత పెరుగుతుంది

అక్టోబర్ 10 నుండి 18 వరకు వైభవంగా బతుకమ్మ పండుగ

04-10-2026 నుండి 10-10-2026 వరకు వారఫలాలు - శుభలేఖ అందుకుంటారు

03-10-2026 శనివారం మీ రాశి ఫలాలు - కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి

తర్వాతి కథనం
Show comments