1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
  4. Lord Shiva Pooja on Makar sankranti

సంక్రాంతి పండుగ రోజున ఆవునేతితో.. శివునికి అభిషేకం చేయిస్తే?

సంక్రాంతి రోజున ఆడపిల్లలు ముగ్గుల మధ్య అందంగా గొబ్బిళ్లను తీర్చి దిద్ది, గొబ్బి పాటలు పాడుతూ కేరింతలు కొడుతుంటారు. అరెసెలు, చుక్కలు వంటి పిండి వంటలు నోరూరిస్తుంటాయి. ధనుర్మాసం నెల పెట్టింది మొదలు సంక్

Lord Shiva Pooja on Makar sankranti
సంక్రాంతి రోజున ఆడపిల్లలు ముగ్గుల మధ్య అందంగా గొబ్బిళ్లను తీర్చి దిద్ది, గొబ్బి పాటలు పాడుతూ కేరింతలు కొడుతుంటారు. అరెసెలు, చుక్కలు వంటి పిండి వంటలు నోరూరిస్తుంటాయి. ధనుర్మాసం నెల పెట్టింది మొదలు సంక్రాంతి పండుగ దాకా ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో కళకళలాడుతాయి. సంక్రాంతి  పండగ అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది.
 
మకర సంక్రాంతి నాటికి వంట ఇంటికి చేరడం ద్వారా సర్వత్రా ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే సంక్రాంతి రోజున ఆవునెయ్యితో శివుడికి అభిషేకం చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఇలాచేస్తే అన్ని భోగాలు ప్రాప్తించి చివరికి మోక్షం కలుగుతుందని పండితులు అంటున్నారు. 
 
ఇక మకర సంక్రాంతి మరుసటి రోజును కనుమ అంటారు. ఈ రోజున రైతుకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారం. ఆ రోజున పశువుల కొట్టాలను చక్కగా అలంకరించి అక్కడ పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్నే పొలి చల్లటం అని అంటారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయన్నది విశ్వాసం.
About Writer
Selvi
తర్వాతి కథనం
సంక్రాంతికి జ్యోతిష్యానికి సంబంధం ఉందా? పగటి పూటే యజ్ఞాలు ఎందుకు చేస్తారో తెలుసా?