1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Perumal Mantras to solve money problems in one day on saturday

ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం ఇలా చేస్తే?

Perumal Mantras
Perumal Mantras
ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం శ్రీమన్నారాయణ స్వామిని పూజించాలి. శ్రీలక్ష్మి, కుబేరుడిని పూజించడమే కాకుండా శనివారం ఈ విధంగా పూజించడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరుతాయి. జీవితంలో ప్రశాంతత, సంపద చేకూరాలంటే.. ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు తొలగిపోవాలంటే.. శనివారం గోవిందుడిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
గోవిందుడిని ఇంట శనివారం పూజ చేయడం లేదా ఆలయానికి వెళ్లి ఆయనను దర్శించుకోవడం ద్వారా ఈతిబాధలు వుండవు. శనివారం గోవిందునికి తులసి అర్చన చేయడం, రెండు నేతి దీపాలు వెలిగించాలి. పండ్లు, చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. 
 
ఇంకా శనివారం, ఏకాదశి రోజున ఉపవాసం వుండటం.. సమస్త దోషాలను దూరం చేస్తుంది. శనివారం విష్ణు సహస్ర నామం, గోవింద నామాన్ని 108 సార్లు పఠించడం మంచిది. 108 సార్లు ఏదైనా పాశురాన్ని పఠించాలి. నారాయణ అనే మంత్రాన్ని పఠించడం సర్వశుభాలను చేకూరుతుంది. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే?