1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
  4. Significance And Rituals Of Kanuma Telugu Festival

Kanuma: సంక్రాంతి సంబరం..కనుమ విశిష్టత.. రైతన్న నేస్తాలు పశువులకు పండగ

Kanuma
Kanuma
Kanuma: సంక్రాంతి సంబరంలో చివరి రోజును కనుమ పండుగగా జరుపుకుంటారు. కనుమ పండుగను పశువుల పండుగ అంటారు. పంటలు పండి పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్నకు ఎంతో గొప్ప నేస్తాలు పశువులు. పశువులు సంవత్సరం అంతా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకునే పండుగగా ఈ కనుమ లేదా పశువుల పండుగలో అంతరార్థం. 
 
కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమ పెట్టి, మెడలో గజ్జెల పట్టీ, కాళ్ళకు మువ్వలు వేస్తారు. ఏడాది మొత్తం రైతులకు సహాయపడుతూ ఎండనక, వాననక కష్టపడే పశువులకు ఏడాదిలో ఒక్కసారి కనుమ పండుగ రోజు పూర్తి విశ్రాంతి కల్పిస్తారు. 
 
పిండి వంటలతో సంక్రాంతి మంచి విందును ఇస్తే, కనుమ పండుగ మసాలా ఘుమఘుమలతో మైమరపిస్తుంది. ఒక నానుడి ప్రకారం కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికీ కదలవని అంటారు. అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరాదని మన పూర్వీకులు అంటారు. తెలుగు రాష్ట్రాలలో కనుమ నాడు ప్రయాణం చేయకూడదని అంటారు. కనీసం ఊరి పొలిమేర కూడా దాటకూడదని అంటారు.
తర్వాతి కథనం
Makara Jyothi: శబరిమలపై మకర జ్యోతి.. దివ్య కాంతిని వీక్షించిన లక్షలాది భక్తులు