1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
  4. Pradhan Raghava participate in Mr india 2026 GOA

'మిస్టర్ ఇండియా' పోటీల్లో తమిళనాడు తరపున తెలుగు కుర్రోడు

pradhan raghava
ప్రముఖ సముద్రతీర పర్యాటక ప్రాంతమైన గోవాలో మిస్టర్ ఇండియా పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో తెలుగు పూర్వీకం కలిగిన ప్రధాన్ రాఘవ తమిళనాడు రాష్ట్రం తరపున పాల్గొంటున్నాడు. రుబారు సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా ఈటుమారిపురం గ్రామానికి చెందిన రాఘవ వెంకట సత్యనారాయణ - శిరీష దంపతులు గత 1965లో ఉద్యోగ రీత్యా తమిళనాడుకు వచ్చి స్థిరపడిపోయారు. వీరికి ఆర్.సాయికార్తి, ఆర్.ప్రధాన్ రాఘవ అనే ఇద్దరు కుమారుడు ఉండగా, చిన్న కుమారుడు క్రికెట్‌లో రాణిస్తున్నాడు. పెద్ద కుమారుడు ప్రధాన్ ప్రస్తుతం చెన్నై లయోలా కాలేజీలో ఎంబీఏ ఆఖరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నాడు.
 
ప్రధాన్‌కు చిన్నతనం నుంచి టెన్నిస్‌ క్రీడపై అమితమైన ఆసక్తివుండటంతో ఖేలో ఇండియా పోటీల్లో యూనివర్శిటీ ఛాంపియన్‌గా నిలిచాడు. గత కరోనా మహమ్మారికి ముందు కారు ప్రమాదంలో ప్రధాన్ వెన్నెముకకు గాయమైంది. దీంతో తనకు ఎంతో ఇష్టమైన టెన్నిస్ క్రీడకు కొంతకాలం దూరం కావాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది.
pradhan raghava
 
అప్పటికీ ఆత్మస్థైర్యం కోల్పోకుండా, మోడలింగ్‌పై దృష్టిసారించిన ప్రధాన్.. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించారు. రుబారు సంస్థ నిర్వహిస్తున్న మిస్టర్ ఇండియా పోటీలకు రాష్ట్రం తరపున తన పేరును నమోదు చేసుకుని మూడు నెలలో పాటు ఆన్‌లైన్‌లో నిర్వహించిన పలు రకాలైన పోటీ పరీక్షల్లో విజేతగా నిలిచాడు. అదేసమయంలో మిస్టర్ ఇండియా పోటీలకు దేశ వ్యాప్తంగా 18 మందిని ఎంపిక చేయగా వీరిలో ఒకరిగా ప్రధాన్ నిలిచాడు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న పోటీల్లో ప్రధాన్ పాల్గొంటున్నాడు. 
 
దీనిపై ప్రధాన్ మాట్లాడుతూ, గోవాలో జరుగుతున్న పోటీల్లో 8 మందిని ఎంపిక చేయనున్నారు. అందులో తాను ఎంపిక అవుతాననే నమ్మకం ఉందన్నారు. ఆ తర్వాత జూన్, జూలై నెలల్లో ముంబైలో జరిగే పోటీల్లో ముగ్గురిని ఎంపిక చేసి మిస్టర్ యూనివర్స్ పోటీలకు పంపుతారని వివరించాడు. మిస్టర్ ఇండియా పోటీల్లో విజేతగా నిలుస్తానన్న నమ్మకం ఉందన్నారు. ఆ తర్వాత మోడలింగ్, సినీ రంగాల్లో రాణించాలని భావిస్తున్నట్టు తెలిపారు. తన విజయాల్లో తల్లిదండ్రులు, తమ్ముడు పాత్ర ఎంతో ఉందని, వారు తనను కంటికి రెప్పలా రక్షిస్తూ, వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారని ప్రధాన్ వివరించాడు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
శతకం సాధించి వుంటే సెల్ఫిష్‌గా కనిపించేవాడిని.. జట్టు గెలుపే ముఖ్యం.. సంజు