బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (13:53 IST)

అక్కడ యాంటీ శృంగార పడకలు... "ఆ" పని చేస్తే విరిగిపోతాయ్...

జపాన్ రాజధాని టోక్యో కేంద్రంగా ఈ నెల 23వ తేదీ నుంచి ఒలింపిక్ క్రీడా పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ మెగా ఈవెంట్ కోసం జపాన్ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా, కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలతో పాటు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేసింది. 
 
అదేసమయంలో ఈ ఈవెంట్‌లో పాల్గొనే క్రీడాకారుల వసతి సౌకర్యాల కోసం ప్రత్యేకంగా ఓ గ్రామాన్నే నిర్మించింది. ఇక్కడ నివశించే క్రీడాకారులు.. శృంగారం చేయకుండా కూడా చర్యలు తీసుకుంది. ఇందుకోసం జపాన్ అధికారులు వినూత్నంగా ఆలోచన చేశారు. 
 
కరోనా నేపథ్యంలో క్రీడాకారులు శారీరకంగా పాల్గొనకుండా ఒలింపిక్‌ గ్రామంలోని వా‍ళ్లు బస చేస్తున్న గదుల్లో విచిత్రమైన బెడ్లను ఏర్పాటు చేశారు. అట్టలతో తయారు చేసిన మంచాలను క్రీడాకారుల గదుల్లో అమర్చారు. దీనివల్ల ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనే వీలుండదని అని వారి యోచన. 
 
ఒలింపిక్స్‌ ముగిశాక వీటిని రీసైక్లింగ్‌ చేసి కాగితపు ఉత్పత్తులుగా మార్చనున్నారు. క్రీడాకారుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు ఈ చర్యలు చేపట్టారు. జూలై 24న ప్రారంభమయ్యే ఒలింపిక్స్ సందర్భంగా ఆటగాళ్ల బస కోసం 18,000 పడకలు అవసరం కాగా, పారా ఒలంపిక్స్‌కు 8,000 పడకలు మాత్రమే అవసరం అయ్యాయి.
 
ప్రస్తుతం ఈ యాంటీ సెక్స్ బెడ్స్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి వైరల్‌‌గా మారి హల్‌‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇవి గరిష్టంగా 200 కిలోల బరువు వరకు ఆపగలవని, అందువల్ల క్రీడాకారులకు అసౌకర్యంగా ఉండబోవని సెలవిస్తున్నారు.