ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (16:39 IST)

ఫిక్సింగ్‌లో చిక్కుకున్న నిక్ లాండా.. మొబైల్ ఫోన్ ఇవ్వనన్నాడు.. ఏడేళ్ల నిషేధం..

ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారుడు నిక్ లాండా ఫిక్సింగ్ అవినీతి వలలో చిక్కుకుపోయాడు. అవినీతిలో చిక్కుకున్న కారణంగా నిక్ లాండాపై ఏడేళ్ల పాటు నిషేధం విధించారు. ఇంకా 35వేల డాలర్ల జరిమానా కూడా విధించారు. ఆ

ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారుడు నిక్ లాండా ఫిక్సింగ్ అవినీతి వలలో చిక్కుకుపోయాడు. అవినీతిలో చిక్కుకున్న కారణంగా నిక్ లాండాపై ఏడేళ్ల పాటు నిషేధం విధించారు. ఇంకా 35వేల డాలర్ల జరిమానా కూడా విధించారు. ఆస్ట్రేలియాలో 2013లో నిర్వహించిన ఓ ఫూచర్స్‌ మ్యాచ్‌ ఫలితం కావాలని మార్చేశాడన్న కేసులో టెన్నిస్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ నిర్వహించిన దర్యాప్తులో నిక్‌ పూర్తి చేసుకున్నాడు.
 
ఇదే మ్యాచ్‌కు సంబంధించిన కేసులో గతేడాది ఆస్ట్రేలియా కోర్టు నిక్‌కు 1000 ఆస్ట్రేలియా డాలర్ల జరిమానా విధించింది. కాగా 2013లో నిక్‌ రిటైర్‌ కావడం గమనార్హం. ఫోరెన్సిక్ పరీక్షల కోసం తన మొబైల్ ఫోన్‌ను ఇచ్చేందుకు నిక్ లాండా నిరాకరించడంతో అతడు అవినీతికి పాల్పడ్డాడని తేలిపోయింది. దీంతో అతనిపై ఏడేళ్ల నిషేధంతో పాటు భారీ జరిమానా పడింది.