శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (19:01 IST)

టోక్యో ఒలింపిక్స్: మెగా క్రీడలకు ప్రేక్షకులను అనుమతించట్లేదు..

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మెగాక్రీడలకు ప్రేక్షకులను అనుమతించట్లేదని ప్రకటించారు. కరోనా వైరస్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒలింపిక్​ మినిస్టర్​ తమయో మరుకవా స్పష్టం చేశారు. టీవీల్లోనే ఈ మెగాక్రీడలను చూడాలని ప్రేక్షకులకు సూచించారు. టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు ఒలింపిక్స్ ప్రెసిడెంట్ క్షమాపణలు చెప్పాడు. ఈ పరిస్థితికి చింతిస్తున్నామని తెలిపాడు.
 
అంతకుముందే అతిథ్య నగరంలో కేసులు అదుపు చేసేందుకు జపాన్ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయమే టోక్యోలో ఎమెర్జన్సీ విధిస్తున్నట్లు జపాన్ ప్రధాని యొషిహిదె సుగా ప్రకటించారు. విజయోత్సవాలతో పాటు మద్యం అమ్మకాలపైనా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్‌ పూర్తయ్యేవరకు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని వెల్లడించారు.