గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 31 మే 2017 (15:21 IST)

టీవీ రిపోర్టర్‌కు లైవ్‌లో ముద్దిచ్చాడు.. ఆమె భుజాలపై చేయి వేశాడు.. ఆపై?

ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో ఫ్రెంచ్ టెన్నిస్ ప్లేయర్ మాక్సిమ్ హామవ్‌ ఓడిపోయాడు. ఆపై ఓవరాక్షన్ చేశాడు. అంతే టోర్నీ నుంచి బహిష్కరణకు గురైయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో మాక్సిమ్ ఓ

ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో ఫ్రెంచ్ టెన్నిస్ ప్లేయర్ మాక్సిమ్ హామవ్‌ ఓడిపోయాడు. ఆపై ఓవరాక్షన్ చేశాడు. అంతే టోర్నీ నుంచి బహిష్కరణకు గురైయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో మాక్సిమ్ ఓడిపోవడంతో అతనని ఇంటర్వ్యూ చేసేందుకు జర్నలిస్టు మాలీ థామస్ అతడి దగ్గరకు వెళ్లింది. లైవ్‌లో మాట్లాడుతుండగానే తొలుత మాక్సిమ్.. ఆమె భుజాలపై చేతులు వేశాడు. ఆమె ఓర్పుతో సంయమనం కోల్పోకుండా నవ్వుతూనే ఇంటర్వ్యూ చేసింది. 
 
ఇంతలో ఉన్నట్టుండి రిపోర్టర్‌కు ముద్దులివ్వడం ప్రారంభించాడు. లైవ్‌లోనే మాలీ థామస్‌కు ముద్దెట్టాడు. ఆమె ఎంతవారించినా పట్టించుకోకుండా అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన రిపోర్టర్ స్పందించింది. లైవ్ కాబట్టి ఊరకున్నానని లేకుంటే చెంపలు వాయించే దాన్నని తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మాలీ థామస్‌కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ‌మాక్సిమ్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.