శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2016 (09:21 IST)

రియో ఒలింపిక్స్: సత్తాచాటిన తెలుగుతేజం పీవీ సింధు.. సెమీఫైనల్లోకి ఎంట్రీ..

ప్రతిష్టాత్మక రియో ఒలంపిక్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు సత్తా నిరూపించుకుంది. అసాధారణ ఆటతో భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. రియోలో పీవీ సింధు అద్భుత ఆటతీరుతో సెమీఫైనల్లోకి చేరుకుంది. మంగళవారం జరిగిన క్వ

ప్రతిష్టాత్మక రియో ఒలంపిక్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు సత్తా నిరూపించుకుంది. అసాధారణ ఆటతో భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. రియోలో పీవీ సింధు అద్భుత ఆటతీరుతో సెమీఫైనల్లోకి చేరుకుంది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో చైనా షట్లర్‌ వాంగ్‌ యీపై 22-20, 21-19 తేడాతో వరుస సెట్లలో గెలిచింది. పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి ముందంజ వేసినప్పటికీ సింధూ ధీటుగా రాణించి గెలుపును నమోదు చేసుకుంది. 
 
ఇదిలా ఉంటే.. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారులకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి పసిడి సాధించే క్రీడాకారులు ఒక్కొక్కరికి రూ. 6 కోట్లు బహుమతిగా అందజేస్తామని హర్యానా క్రీడలశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ ప్రకటించారు. విశ్వక్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులను ప్రోత్సహించేందుకుగాను ప్రస్తుతం రియోలో ఉన్న అనిల్‌ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత క్రీడాకారులు పతకం కోసం తీవ్రంగా పోరాడుతున్నారని అనిల్ చెప్పుకొచ్చారు.