గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (17:54 IST)

క్రిస్టియానో రొనాల్డో నమ్మించి మోసం చేశాడు.. నన్ను అలా చేశాడు: కేథరిన్

పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్, స్టార్ క్రీడాకారుడు రొనాల్డోపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఫుట్‌బాల్‌లో ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్న రొనాల్డో తనను వేధిస్తున్నాడంటూ అమెరికాకు చెందిన కేథరిన్ (34) అనే

పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్, స్టార్ క్రీడాకారుడు రొనాల్డోపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఫుట్‌బాల్‌లో ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్న రొనాల్డో తనను వేధిస్తున్నాడంటూ అమెరికాకు చెందిన కేథరిన్ (34) అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రొనాల్డో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ షాకయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే.. కేథరిన్‌తో రొనాల్డో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడని.. అయితే నమ్మించి మోసం చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని కేథరిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతేగాకుండా ఈ విషయం బయటపొక్కనీయకుండా వుండేందుకు రూ.3కోట్లు ఆఫర్ చేశాడని బాధితురాలుగా చెప్పుకుంటున్న కేథరిన్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై రొనాల్డో స్పందిస్తూ.. కేథరిన్ అనే అమ్మాయి చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాడు. 
 
తనతో సన్నిహితంగా గుంపులో తీసుకున్న ఫోటోల్లో ఏమాత్రం నిజం లేదని... తనను చాలామంది ఫ్యాన్స్ కలుస్తుంటారని.. వారితో ఫోటోలు దిగడం సహజమని తెలిపాడు. కేథరిన్ విమర్శల్లో ఎలాంటి నిజం లేదని త్వరలో తేలిపోతుందన్నాడు. అయితే తొమ్మిదేళ్ల క్రితమే కేథరిన్ రొనాల్డోపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది.