1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2016 (11:56 IST)

సాక్షి మాలిక్ కోచ్‌కు చెప్పులరిగిపోయేలా తిరుగుతున్నా డబ్బులు ఇవ్వని హర్యానా సర్కారు

రియో ఒలింపిక్స్ విజేతలకు ఒరిజినల్ చెక్కులు ఇవ్వడంలో హర్యానా సర్కారు తన నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఒరిజినల్ చెక్కులు ఇచ్చేందుకు రియో విజేతలు చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నా.. అసలు చెక్కులు మాత్ర

రియో ఒలింపిక్స్ విజేతలకు ఒరిజినల్ చెక్కులు ఇవ్వడంలో హర్యానా సర్కారు తన నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఒరిజినల్ చెక్కులు ఇచ్చేందుకు రియో విజేతలు చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నా.. అసలు చెక్కులు మాత్రం ఇవ్వడం లేదు. 
 
రియో ఒలింపిక్స్ క్రీడల్లో విజయం సాధించిన విజేతలకు ప్రోత్సాహకంగా నగదు ఇస్తున్నామని చెప్పి, చెక్కు నకలు చేతికిచ్చి ఫోటోలకు ఫోజులిచ్చింది. కానీ, అసలు కాపీని కాళ్లరిగేలా తిరిగినా ఇవ్వలేదని వాపోతున్నాడు ఒలింపిక్ పతక విజేత సాక్షీ మాలిక్ కోచ్ కుదదీప్ మాలిక్. 
 
అలాగే, కులదీప్ కృషిని గుర్తిస్తున్నామని చెప్పిన హర్యానా పాలకులు, రియో నుంచి వెనక్కి వచ్చిన తర్వాత గొప్ప సభ పెట్టి, రూ.10 లక్షల చెక్కు ఫోటో కాపీని అందించారు. ఆపై సాక్షి మాలిక్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న వేళ, అక్కడే ఉన్న రైల్వే మంత్రి సురేష్ ప్రభు, కులదీప్‌ను అభినందిస్తూ, చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చారు. 
 
అయితే, తనకు రావాల్సిన రూ.10 లక్షల చెక్కు కోసం హర్యానా ప్రభుత్వాన్ని, ప్రమోషన్ కోసం రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డును ఎన్నిమార్లు కలిసినా న్యాయం జరగడం లేదని కులదీప్ వాపోయాడు. "సాక్షికి ఎన్నో పురస్కారాలు లభించాయి. సూపర్ లగ్జరీ బీఎండబ్ల్యూ కారును కూడా ఆమె అందుకుంది. నాకన్నా ఎక్కువగా సంతోషించేవాళ్లు ఎవరూ ఉండరు. ఇదే సమయంలో నాకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు. ఇందెంతో అసంతృప్తిని కలిగిస్తోంది" అని 2011 నుంచి ఆమెకు కోచ్‌గా ఉన్న కులదీప్ వాపోయాడు.