శనివారం, 16 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2016 (17:04 IST)

రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనే లేదు.. మరో 3-4ఏళ్లు టెన్నిస్ ఆడుతా: రోజర్ ఫెదరర్

టెన్నిస్ రారాజు, స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్ యోచన లేదని క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పటికిప్పుడే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదన రోజర్ ఫెదరర్ ప్రకటించేశాడు. కొత్త సంవత్సరం సందర్భంగా ఫెదరర్

టెన్నిస్ రారాజు, స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్ యోచన లేదని క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పటికిప్పుడే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదన రోజర్ ఫెదరర్ ప్రకటించేశాడు. కొత్త సంవత్సరం సందర్భంగా ఫెదరర్ మాట్లాడుతూ.. మరో నాలుగేళ్ల పాటు టెన్నిస్ ఆడాలనుకుంటున్నానని స్పష్టం చేశాడు. దీంతో ఫెదరర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
రిటైర్మెంట్ యోచన మాత్రం లేదని కానీ ఇంతముందులా టెన్నిస్ కోర్టులో మెరుగ్గా  రాణిస్తానని చెప్పలేనని.. అదే ఫామ్‌ను కనబరుస్తానో లేదో అనే విషయాన్ని కూడా చెప్పలేనని ఫెదరర్ వెల్లడించాడు. కానీ టెన్నిస్ కోర్టులో ప్రత్యర్థిపై గట్టిగా రాణించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని రోజర్ ఫెదదర్ చెప్పుకొచ్చాడు 
 
ఇదిలా ఉంటే.. గత జులైలో వింబుల్డన్ సందర్భంగా ఫెదరర్ గాయపడిన అనంతరం ఫెదరర్ ఒక్క గేమ్ కూడా ఆడలేదు. జనవరి 1- 7 మధ్య పెర్త్‌లో జరిగే హాప్ మన్ కప్ టీమ్ ఈవెంట్‌లో ఫెదరర్ మళ్లీ బరిలోకి దిగబోతున్నాడు. మెన్స్ సింగిల్స్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఫెదరర్ చాలాకాలం పాటు నంబర్ 1 ర్యాంకులో కొనసాగాడు. కానీ ప్రస్తుతం 16వ ర్యాంకుకు పడిపోయాడు.