1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2016 (09:48 IST)

కొడుకు పుడితే.. ఆటగాడే కావాలా? నటుడు కావొచ్చు కదా?: సానియా మీర్జా

భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ అమ్మాయి, పాకిస్థాన్ కోడలు సానియా మీర్జా మీడియా అడిగే ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చింది. సానియా మీర్జాకు పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలి

భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ అమ్మాయి, పాకిస్థాన్ కోడలు సానియా మీర్జా మీడియా అడిగే ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చింది. సానియా మీర్జాకు పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక జీ టీవీ నిర్వహించే 'యాదోంకీ బారాత్' కార్యక్రమంలో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో కలసి సానియా మీర్జా పాల్గొన్న వేళ, కార్యక్రమం హోస్ట్, బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్, సానియాకు ఊహించని ప్రశ్నను సంధించాడు. 
 
మీకు, షోయబ్ మాలిక్ కు కుమారుడు పుట్టి, ఆటగాడైతే, ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు?" అని అడిగాడు. ఇక దీనికి సానియా ఏ మాత్రమూ తొణకకుండా దిమ్మతిరిగే సమాధానాన్నే ఇచ్చింది. 
 
నిజాయితీగా చెప్పాలంటే.. ఈ విషయం గురించి తాము ఎప్పుడూ చర్చించలేదన్నారు. మాకు తెలియదు కూడా.. మా బిడ్డ ఆటగాడే ఎందుకు కావాలి.. నటుడు కావచ్చు. టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు.. అంటూ చెప్పుకొచ్చింది. భారతీయురాలైనందుకు తానెంతో గర్విస్తున్నాను.. పాకిస్థానీ అయినందుకు మాలిక్ కూడా అంతే.. తాము భార్యాభర్తలమైనందుకు ఇంకా ఎంతో గర్విస్తున్నామని సానియా మీర్జా చెప్పుకొచ్చింది.