బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (10:37 IST)

గజ్వేల్ అసెంబ్లీ స్థానం : రూపు రేఖలు మార్చిన సీఎం కేసీఆర్

kcrao
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గజ్వేల్‌ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సమైక్య రాష్ట్రం నుంచి మొదలుకుని ఇప్పటివరకు గజ్వేల్‌ నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. గతంలో కాంగ్రెస్‌, టీడీపీ పోటాపోటీగా తలపడినప్పటికీ, కేసీఆర్‌ అడుగుపెట్టిన తర్వాత గజ్వేల్‌లో వార్‌ వన్‌సైడ్‌ అయ్యింది. సిద్ధిపేట జిల్లా పరిధిలో వస్తుంది. గజ్వేల్ మండలానికి చెందిన గ్రామం.. 2012లో గజ్వేల్ పురపాలకసంఘంగా ఏర్పాటైంది. గజ్వేల్ అసలు పేరు గజవెల్లువ. రాజుల కాలంలో ఏనుగులతో గజ్వేల్‌కు నీరు తీసుకువచ్చేవారని ప్రతీతి. ఇక్కడ నుంచి సీఎం కేసీఆర్ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, 
 
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 125444 (తెరాస)
వంటేరు ప్రతాప్ రెడ్డి 67154 (కాంగ్రెస్)
కంటె సాయన్న 3353 (ఇండిపెండెంట్)
బిట్ల వెంకటేశ్వర్లు 1636 (ఇండిపెండెంట్)
నోటా 1624
ఆకుల విజయ 1587 (బీజేపీ)
యాదగిరి పెద్దసాయిగారి 1350 (ఇండిపెండెంట్)
గుర్రపు రాములు 1229 (ఇండిపెండెంట్)
కనకయ్య గజ్జెల 1023 (బీఎస్పీ) 
జీడిపల్లి శ్రీనివాస్ 892 (ఎన్ఐపి)
కడియం కృపాకర్ 877 (ఇండిపెండెంట్)
పి.సతీష్ 810 (ఇండిపెండెంట్)
శ్రీనివాస్ శ్రీరాముల 315 (బీఎల్ఎఫ్పీ) 
ఎమ్మాపురం యాదగిరి గౌడ్ 226 (ఇండిపెండెంట్)