సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (11:01 IST)

తెరాస ఎమ్మెల్సీ యాదవ రెడ్డి సస్పెండ్.. కేసీఆర్ ఆర్డర్స్

ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని టీఆర్‌ఎస్ పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున క్రమశిక్షణ చర్యల్లో భాగంగా యాదవరెడ్డిపై బహిష్కరణ వేటు వేసినట్లు పేర్కొంది. 
 
ఇదిలావుండగా, యాదవరెడ్డి శుక్రవారం యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. అదేవిధంగా తెరాసకు రాజీనామా చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంఎల్‌సి జగదీశ్వర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు.