ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (16:18 IST)

తెలంగాణ ఎన్నికల ఫలితాలు.. డిపాజిట్లు కోల్పోయిన జనసేన

తెలంగాణలో జనసేన పార్టీకి ఓటర్లు చుక్కలు చూపించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వారం రోజులు కేటాయించారు. దీంతో తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రాణించలేకపోయారు. ఫలితంగా జనసేన డిపాజిట్ కోల్పోయింది. 
 
తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన మొత్తం 8 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది. కూకట్‌పల్లిలో మాత్రమే ప్రస్తావించదగిన స్థానంలో ఉన్నారు. కానీ చివరికి ఇక్కడ కూడా ఓడిపోయారు.
 
జనసేన పార్టీ 3-4 నియోజకవర్గాల్లో నోటాతో గట్టి పోటీని ఎదుర్కొంది. తెలంగాణలో భవితవ్యం చూసి ఏపీలో టీడీపీ, బీజేపీతో చేతులు కలపడం జనసేనకు తెలంగాణలో కలిసిరాలేదని టాక్. తెలంగాణలో డిపాజిట్లు కోల్పోయినా.. పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికలపై మాత్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.