సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 జూన్ 2024 (14:50 IST)

ఒక మహిళపై 15 వీధికుక్కల దాడి.. చివరికి ఏమైందంటే?

street dogs
street dogs
హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ మహిళపై దాదాపు 15 వీధి కుక్కలు దాడి చేసే ప్రయత్నం చేశాయి. ఈ ఘటన హైదరాబాద్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు జీహెచ్ఎంసీపై మండిపడుతున్నారు. 
 
ఈ ఘటన చిత్రపురి కాలనీలో జరిగింది. చిత్రపురి కాలనీలో నడుచుకుంటూ వెళ్తోన్న మహిళపై వీధికుక్కలు దాడికి యత్నించాయి. చుట్టుముట్టిన వీధి శునకాల బారి నుంచి తప్పించుకునేందుకు మహిళ ప్రయత్నం చేసింది. చివరికి ఓ ద్విచక్రవాహనదారుడు కుక్కలను తరమడంతో మహిళ ప్రాణాలతో బయట పడింది. ఈ దృశ్యాలన్ని అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.