గురువారం, 20 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మే 2024 (16:33 IST)

జీహెచ్ఎంసీ ఉద్యోగి లైంగిక దాడి.. మహిళా ఉద్యోగికి నరకం చూపాడు.. వీడియో వైరల్

Ghmc Field Assistant
Ghmc Field Assistant
శానిటేషన్ సిబ్బందిపై జీహెచ్ఎంసీ ఉద్యోగి లైంగిక దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోతో మహిళా ఉద్యోగికి నరకం చూపించాడు. మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
 
వివరాల్లోకి వెళితే.. గాజులరామారం జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఎ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) అధికారి కిషన్ మహిళా శానిటేషన్ సిబ్బందిని భయపెట్టి లైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. 
 
తన మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానని మహిళా ఉద్యోగులను నానా ఇబ్బందులకు గురిచేశాడు. పరిస్థితి విషమించడంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అతనిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. బాధితురాలు అధికారి వేధింపులకు తట్టుకోలేక ఎవరికి చెప్పలేక నరక యాతన అనుభవించింది. గతిలోని పరిస్థితిలో అతని చెరలో చిక్కుకుంది. 
 
కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ)గా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే ఉద్యోగి చేతిలో మహిళా కార్మికులు లైంగిక దాడిని ఎదుర్కొన్నారు.