ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మే 2024 (15:52 IST)

భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సహజీవనం.. చివరికి?

couple
భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సహజీవనం చేస్తున్న కొమురవెల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం నాగరాజును మల్టీజోన్-ఐ ఐజీ ఎస్వీ రంగనాథ్ విధుల నుంచి సస్పెండ్ చేశారు. కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ భార్య మానస నిరసనకు దిగడంతో నాగరాజును ఐజీ సస్పెండ్ చేశారు.
 
ఇదే కారణంతో రాజన్న-సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన మరో కానిస్టేబుల్‌ పి.శ్రీనివాస్‌ను కూడా ఐజి సస్పెండ్‌ చేశారు. శ్రీనివాస్ కూడా తన భార్యకు విడాకులు ఇవ్వకుండా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు.