గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మే 2024 (09:22 IST)

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

palla rajeswar reddy
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరిగింది. ఈ ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆయన భార్య లావణ్య దేవి విశాఖపట్టణం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అయితే, ఈ నెల 4వ తేదీన భర్త తరపున ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదులు వెల్లడంతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీచేశారు. అందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పేర్కొన్నారు. 
 
ఈ నోటీసులకు స్పందించిన లావణ్య... తాను శ్రీవాణి అనే మహిళను కలిశానని, ఎలాంటి ఎన్నికల ర్యాలీలో పాల్గొనలేదని వివరణ ఇచ్చారు. అయితే, ఈ వివరణపై సంతృప్తి చెందని రిటర్నింగ్ అధికారి.. అసిస్టెంట్ ప్రొఫెసర్ లావణ్యపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌ను కోరారు. దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ ఏయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు బరిలో ఉంటే, వైకాపా నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. ఈయన గత ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై గెలుపొందిన విషయం తెల్సిందే.