సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 మే 2024 (20:07 IST)

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

tdpflag
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ 151కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించారు. పొత్తుల విషయానికి వస్తే, టీడీపీ+ కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుందనే దానిపై కాస్త క్లారిటీ వుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. టీడీపీ+ ఎలా ఉన్నా 100-120 సీట్లు సునాయాసంగా దక్కించుకోవడం ఖాయమని కూటమి నేతలు అంటున్నారు. 
 
మిత్రపక్షాల సాయం లేకుండా టీడీపీకి మెజారిటీ మార్కు ఉంటుంది. ఎలాగైనా, కూటమికి అనుకూలమైన విజయం వుంటుందని టాక్ వస్తోంది.  ప్రతి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు సంబంధించి ఎన్ని ఓట్లు పోలయ్యాయన్న దానిపై కింది స్థాయి నాయకత్వం ఇప్పటికే ఆయా అభ్యర్థుల వద్ద లెక్కలు వేస్తోంది. 
 
నియోజకవర్గాల వారీగా పక్కగా 17ఏ ద్వారా పోలైన ఓట్లు తెలిస్తే మరింత స్పస్టత రానుందని టీడీపీ వర్గాలద్వారా సమాచారం. ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి నియోజకవర్గాల నుంచి సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి అందజేస్తున్నారు.