గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 13 ఫిబ్రవరి 2025 (17:57 IST)

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

telangana high court
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆమె మాట్లాడుతూ... విభజన జరగక ముందు వరకూ తెలంగాణ ప్రాంతం మిగులు బడ్జెట్టుతో వుందనీ, విభజన పూర్తయ్యాక ఆ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల కూడా వివక్ష చూపడం లేదని ఈ సందర్భంగా ఆమె చెప్పారు.
 
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఆదాయపన్ను బిల్లు-2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ లోక్‍‌సభలో ప్రవేశపెట్టారు. దీనికి నిరసనగా విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రస్తుంత అమల్లో ఉన్న చట్టం దశాబ్దాల క్రితం తయారు చేసింది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకునిరానుంది. ఇందులోభాగంగా, ఆదాయపన్ను నూతన బిల్లు 2025ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. 
 
ఈ బిల్లుని విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. దీంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్చి పదో తేదీ నాటిక వాయిదాపడింది. 
 
విపక్షాల నిరసనల మధ్య ఆదాయపన్నుచట్టానికి, ఇప్పటివరకు ఎన్నో సవరణలు చేశారు. దీంతో ఇది సంక్లిష్టంగా మారింది. పన్ను చెల్లింపుదారులకు వ్యయాలు పెరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి, మరింత సరళంగా చేస్తామని గత 2024 జూలై బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకు అనుగుణంగానే కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది.