వరంగల్ అమ్మాయి, అమెరికా అబ్బాయి.. తెలంగాణలో డుం.. డుం.. డుం.. (Video)
America Boy Married Telangana Girl
వరంగల్ అమ్మాయి, అమెరికా అబ్బాయి ఒక్కటయ్యారు. వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కాశీబుగ్గకు చెందిన అమ్మాయి సుప్రియ-అమెరికాకు చెందిన గ్రాండ్ అనే వ్యక్తితో అమెరికాలో ప్రేమించుకుని ఇంట్లో పెద్దలను ఒప్పించింది. దీంతో వారి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుక తెలుగింటి సంప్రదాయం ప్రకారం జరిగింది.
వివరాల్లోకి వెళితే మాజీ కౌన్సిలర్ దూపం పద్మ రెండో కుమార్తె సుప్రియ అమెరికాలో చదువుకునేందుకు వెళ్లారు. అక్కడ చికాగోకు చెందిన గ్రాండ్‌తో ఆమె ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో వారి అనుమతితో ఘనంగా వీరి పెళ్లి వరంగల్‌లోని కీర్తి గార్డెన్స్‌లో జరిగింది.
స్థానికంగా ఈ వివాహాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున స్థానికులు కళ్యాణ వేడుక జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.