మంగళవారం, 18 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 మార్చి 2025 (16:21 IST)

Chittoor man snake bite పాములకు అతనంటే చాలా ఇష్టం.. 30ఏళ్లుగా కాటేస్తూనే వున్నాయి..

Snake
పాములకు అతనంటే చాలా ఇష్టం. ప్రతి ఏటా ఎక్కడికి వెళ్లినా అతడిని వదిలిపెట్టవు. అతని పేరు సుబ్రహ్మణ్యం. అతను ఓ భవన నిర్మాణ కార్మికుడు. ఏం చేశాడో ఏమో కానీ పాములు అతని కాటేయడం మానట్లేదు. పాము కరిచిన ప్రతిసారి ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి రావడం.. మళ్లీ ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ కూలి పనులకు వెళ్తుండడం పరిపాటయ్యింది. ఇలా తరచూ పాములు కాటు వేయడంతో సర్పదోష నివారణ.. రాహుకేతు పూజలు, పరిహారాల వంటివి చేసినా సరే పరిస్థితి మారలేదు. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కుమ్మరగుంటకు చెందిన సుబ్రహ్మణ్యం వయసు 50 ఏళ్లు. సుబ్రహ్మణ్యం 20 ఏళ్ల వయసులో మొదటిసారి పాము కరిచింంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. అప్పటి నుంచి ప్రతీ ఏటా ఎక్కడికెళ్లి.. బయటూరుకి వెళ్లినా పాము కాటు వేయడం ఆపలేదు. తాజాగా రెండు రోజుల క్రితం ఊరిలో పనులు చేస్తుండగా అతడ్ని పాము కరిచింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇలా తనను తరచూ పాములు కరుస్తుండటంతో ఆస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ కోసం అప్పులు చేయాల్సి వస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.