బుధవారం, 16 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (21:52 IST)

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడిపై దాడి (Video)

chilukuri rangarajan
తెలంగాణా రాష్ట్రంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ చిలుకూరుపై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. శుక్రవారం ఈ దాడి జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రధాన అర్చకుడుపై ఏకంగా 20 మంది వరకు దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ దాడికి పాల్పడింది రామ రాజ్యం సంస్థకుకు సంబందించిన వ్యక్తులుగా తెలుస్తుంది. ఆలయ బాధ్యతలు అప్పగించి తమ సంస్థలో చేరాలని రంగరాజన్‌ను వారు బెదిరించినట్టు సమాచారం. దీనిపై రంగరాజన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన రంగరాజన్‌పై దాడిని రెండు రోజులు అవుతున్నా బయటకు రాకుండా గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. అదేసమయంలో అసలు తెలంగాణా రాష్ట్రంలో ఏం జరుగుతుందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.