బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (08:35 IST)

కేసీఆర్ - కేటీఆర్‌కు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారనీ చిత్తుగా కొట్టారు.. (వీడియో)

brs worker
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోతున్నారు. అధికారం తమది కావడంతో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రేగిపోయింది. అధికార పార్టీకి చెందిన వైకాపా నేతలు గత నాలుగున్నరేళ్ళుగా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇపుడు ఈ సంస్కృతి తెలంగాణాకు కూడా పాకింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాకు కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. 
 
తాజాగా గ్రామ వాట్సాప్ గ్రూపులో కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టినందుకు కాంగ్రెస్ నాయకులు ఇంటికి వచ్చి మరీ కొట్టారు. సూర్యాపేట - తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లిలో న్యూ ఇయర్ సందర్భంగా విషెస్ చెప్తూ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ఫోటోలు జత చేసి గ్రామ వాట్సాప్ గ్రూపులో మహేష్ అనే భారత రాష్ట్ర సమితి కార్యకర్త పోస్టు పెట్టాడు. దీన్ని గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు జూల నర్సయ్య మహేష్ ఇంటికి వెళ్లి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన మహేష్ తల్లి వీరమ్మ, తమ్ముడు శ్రావణ్ మీద సైతం దాడి చేశారు.