ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 డిశెంబరు 2024 (14:25 IST)

Daughter in law Attack: కోడలి అరాచకం.. మామను చెప్పుతో కొట్టింది.. (Video)

Father in Law
Father in Law
అత్త అరాచకాలు వినివుంటాం. అయితే కోడలి అరాచకాలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మామపై విచక్షణారహితంగా చెప్పుతో దాడి చేసింది ఓ కోడలు. నల్గొండ - వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వృద్ధుడైన మామపై విచక్షణారహితంగా దాడి చేసింది కోడలు. 
 
వీల్ చైర్‌లో ఉన్న మామ మొఖంపై పదే పదే చెప్పుతో దాడికి పాల్పడింది. కాళ్లు పట్టుకొని వేడుకున్నా కనికరించలేదు కోడలు. కోడలి దాడిని శునకం కూడా అడ్డుకున్నా ఆమె పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.