ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2024 (13:18 IST)

వరంగల్‌లో దారుణ హత్య - కారులో మృతదేహం

deadbody in car
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలో పట్టపగలే హత్య చేసి మృతదేహాన్ని కార్లో పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. కాళ్లకు తాళ్లు కట్టి హత్య చేసి.. మృతదేహాన్ని కారులో పెట్టి హంతకులు పరారయ్యారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. మృతుడు హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన బ్యాంక్ ఉద్యోగి వెలుగట్టి రాజా మోహన్‌గా గుర్తించారు.  
 
మరోవైపు, వరంగల్ నగరంలో పట్టపగలే హత్య చేసి మృతదేహాన్ని కార్లో పెట్టిన ఘటనపై ఉన్న మిస్టరీ వీడిపోయింది. డబ్బు, బంగారం కోసమే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. హంతకుడు ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన జక్కుల శ్రీను అనే యూట్యూబ్ జర్నలిస్టుగా గుర్తించారు. 
 
మృతుడుకి మద్యం తాగించి రోకలి బండతో కొట్టి చంపేసినట్టు పోలీసులు వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య దగ్గర పీఏగా పని చేసిన నిందితుడు శ్రీను గతంలో కూడా పలువురిని బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.