బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2024 (22:16 IST)

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Divvela Madhuri
Divvela Madhuri
దువ్వాడ శ్రీనివాస్ మాధురి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇటీవల పుట్టినరోజు వేడుకలలో భాగంగా వీరు ఒకరి కోసం మరొకరు పెద్ద ఎత్తున పార్టీలు ఏర్పాటు చేసుకోవడం ఖరీదైన కానుకలను ఇచ్చిపుచ్చుకోవడం కూడా జరిగింది. 
 
ఇకపోతే.. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాధురి మాట్లాడుతూ.. కేటీఆర్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. తనకు కేటీఆర్ చాలా బాగా తెలుసు అని.. మేమిద్దరం క్లోజ్ అంటూ తెలియజేశారు. తాను బెల్లంకొండ సురేష్ ద్వారా కేటీఆర్‌ను పార్క్ హయత్ హోటల్లో రెండు మూడు సార్లు కలిసానని పేర్కొన్నారు. 
 
కేటీఆర్‌కి పెద్ద పొలిటిషన్ అనే గర్వం ఉండదని చాలా సరదాగా ఉంటారని కేటీఆర్ గురించి తెలిపారు. రాజకీయాలలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఎంతో ఓపికగా పనిచేయాలని విషయాలను కేటీఆర్ తెలియచేస్తారని.. ఇక దువ్వాడ శ్రీనివాస్ కూడా కేటీఆర్ పొలిటికల్ లైఫ్ రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారని వెల్లడించారు.
 
అయితే కేటీఆర్‌ను పార్క్ హయత్ హోటల్‌లో కలిసారని వస్తున్న వార్తలపై దివ్వెల మాధురి స్పందించారు. కేటీఆర్‌ను కలిసారన్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. తనకు బెల్లంకొండ సురేష్ అంటే ఎవరో తెలీదని క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ వార్తలు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలీదని అన్నారు. 
 
ఈ వార్త చూడగానే తాను కూడా షాక్ అయినట్లు తెలిపారు. ఎవరైతే ఈ వార్త పోస్ట్ చేశారో.. వారు పక్కాగా ఆధారాలు ఉంటే ఇలాంటివి స్ప్రెడ్ చేయాలని అన్నారు. ఆధారాలు లేకుండా ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. 
 
తానెప్పుడూ కేటీఆర్‌ను కలవలేదని.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదని తెలిపారు. అసలు ఆయన్ను కలవాలని కూడా ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఈ విషయాన్ని తాను కేటీఆర్‌ను కలిసి చెప్పాలని ఉందని ఆమె చెప్పారు. ఒకవేళ కలవలేకపోయినా.. ఆయనకు కాల్ చేసి అయినా ఈ విషయం చెప్పాలనుందని ఆమె తెలిపారు. ఇకపై తనను దివ్వెల మాధురి అని పిలవొద్దని.. దువ్వాడ మాధురి అని పిలవాలన్నారు.