సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 జులై 2024 (10:04 IST)

సైబరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. వీకెండ్ పార్టీ.. 24మంది అరెస్ట్

party
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, ఎస్‌ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి ఖాజాగూడాలోని ది కేవ్ బార్ అండ్ లాంజ్‌లో దాడులు నిర్వహించారు. 
 
ఈ దాడుల్లో 24మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వీకెండ్ ఈవెంట్‌ పేరుతో జరిగిన ఈ పార్టీలో పట్టుబడిన 50మందికి జరిపిన పరీక్షల్లో 24మందికి పాజిటివ్ అని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ పార్టీకి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఈవెంట్ ఆర్గనైజర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.