కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ నేతల జంప్ - నాగర్‌దొడ్డి వెంకట్‌రామ్‌కి గద్వాల్ పగ్గాలు
బీఆర్‌ఎస్ పార్టీ గద్వాల జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ క్యాడర్‌లో విలీనమయ్యారు. దీంతో గద్వాల్ జిల్లాలో మిగిలిన బీఆర్‌ఎస్ నేతలు ఎవరు నాయకత్వ పగ్గాలు చేపడతారనే దానిపై చర్చలు సాగుతున్నాయి.
ఉద్యమ కాలం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగిన నాగర్‌దొడ్డి వెంకట్‌రామ్ సీనియర్ నేతల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గద్వాల్ జిల్లాలో నాగర్ దొడ్డి వెంకట్ రాముడుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పగించే ప్రయత్నాల్లో ఉన్నారు.
BRS పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, కేసీఆర్‌కు సన్నిహితుడుగా, వెంకట్ రాముడు ఒక ముఖ్యమైన నాయకుడిగా ఎదిగారు. ముఖ్యంగా పార్టీలో ఆయనకున్న ప్రజాదరణ, ప్రభావం కారణంగా ఈ పదవిని ఆయనకు అందించేందుకు బీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తోంది.
ముఖ్యంగా గద్వాల నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయనకు ప్రస్తుత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కంటే ఎక్కువ ప్రజాదరణ ఉంది.