శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (08:25 IST)

కర్రసాయంతో కేసీఆర్ అడుగులో అడుగు... వీడియో వైరల్

kcr walking
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ వైద్య సిబ్బంది సాయంతో కర్రసాయంతో చిన్నగా నడుస్తున్నారు. ఆయన నడకకు సంబంధించిన వీడియోను రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అదికాస్త వైరల్ అయింది. అలాగే, త్వరలోనే కేసీఆర్ పూర్తికా కోలుకుని ప్రజల ముందుకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
గత నెలలో తన ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్‌లో జారిపడటంతో కాలి తుంటె ఎముక విరిగింది. దీంతో ఆయనకు హైదరాబాద్ యశోధ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నంది నగర్‌లో ఉన్న తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్య సిబ్బంది సాయంతో క్రమంగా నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. సంతోష్ కుమార్ పోస్ట్ చేసిన వీడియోలో కేసీఆర్ ఓ ఊతకర్ర సాయంతో వైద్య సహాయకుడి సమక్షంలో మెల్లిగా అడుగులు వేస్తున్నారు. ఆయన ప్రతి అడుగులో దృఢ సంకల్పం కనిపిస్తుందని, కర్ర సాయంతో నడుస్తున్నారని, త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని పేర్కొన్నారు.