శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (14:25 IST)

వైట్ హౌస్ కాంప్లెక్స్ గేటును ఢీకొట్టిన కారు

వాషింగ్టన్‌లో ఓ వ్యక్తి తన కారుతో వైట్ హౌస్ కాంప్లెక్స్ గేటునే ఢీకొట్టాడు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన వాషింగ్టన్ పోలీసులు ఆ వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది యాక్సిడెంటా లేక ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి ఘటనా అనేది తేలాల్సి వుంది. ఈ ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్‌లో లేరు. 
 
ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం అధికార ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మి వెల్లడించారు. ఇంకా ట్రాఫిక్ జాం ఏర్పడింది. గత నెలలోనూ ఓ వ్యక్తి తప్పతాగి తన వాహనంతో బైడెన్ కాన్వాయ్‌ని ఢీకొట్టిన సంగతి తెలిసిందే.